SUPERB
mind blowing movie....
ఈ రోజుల్లో మంచి విలువలు గల సినిమా ఏదైనా వుందా అంటే అది బలగం సినిమా ఒక్కటే, జీవిత విలువలు, కుటుంబ నేపథ్యము, ప్రేమలు, పనికి మాలిన పట్టింపులు,పల్లెటూరి వాతావరణాన్ని, బంధాలు భాంధవ్యాలను కళ్ళకు కట్టినట్టు, కళ్ళలో నీళ్ళు కమ్మేలా చిత్రీకరించిన కమెడియన్ వేణు ఎలదండి ఎంత ఎదిగాడో ఊహకందడు. నా దృష్టిలో అవార్డులన్నీ ఈ సినిమాకే దక్కాలి. నేను ఎంత బావోద్వేగాలకు లోనయ్యానో ఊహకు అందదు. నేను ఒకింత నా బాల్యములో గడిపాను. కోట్లు ఖర్చు పెట్టి పిచ్చి సినిమాలు తీసి సమాజాన్ని నాశనం చేస్తున్న ఈరోజుల్లోఒక మంచి సినిమా చూసిన ఆనందం కలిగింది. ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైన ఉంటే తప్పక చూడండి