సినిమా బండి….ఏముందప్పా ఈ చిత్రమ్ నిజంగా చిత్రమే! ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు పల్లెల్లో కన్నడ పరిమళంతో కూడిన ఆ ప్రత్యేకమైన తెలుగు యాస యొక్క సొంపులు నిజంగా కర్ణాటమే (కర్ణ+అట)!
గ్రామాల దయనీయ దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ చలనచిత్రం. కోస్తా జిల్లాల పల్లెటూళ్ళ కంటే సీడేడ్ మరియూ నైజాం పల్లెటూళ్ళ పరిస్థితుల మధ్య సారూప్యం ఎక్కువగా ఉంటుంది. చాలా వరకూ ఈ రెండు ప్రాంతాలలోను నీటి కటకటలు ఎక్కువగా ఉంటాయి (కోస్తాతో పోలిస్తే). వలసలు అత్యంత సాధరణం. Protagonist (ఆటో డ్రైవరు) యొక్క మాటలు, ఆలోచనలు, భావాల బట్టీ గ్రామీణ-భారతదేశపు ప్రజల కనీస అవసరాలైన తిండి, నీరు, విద్యుత్, రోడ్లు, చేయడానికి పని, సరైన వసతులు లేకపోవడం మరియు వాటికి విరుగుడు కోసం ఏదైనా ఒకటి చేయాలనే తపన కనిపిస్తుంది. చాలా మంచి విషయం. నగరాలకూ, గ్రామాలకు మధ్యనున్న Extreme Polarism అర్ధం చేసుకోవాలంటే ఈ కదిలే బొమ్మల పడాన్ని చూడాల్సిందే!
ఇందులో చాలా పాత్రలు మిమ్మల్లి వెంటాడుతూ ఉంటాయి. మచ్చుకు కొన్ని…Protagonist (ఆటో డ్రైవర్) భార్య పాత్ర అయితే peeks అస్సలు (ఈ పాత్రను సినిమాలో చూడాలేకానీ రాయడానికి కుదరదు), చదువురాని కథారచయితైన ముసలి తాత, తర్కారీలు అమ్ముకొనే మంగ, cameraman, ఊరి జనం, చిన్నపిల్లోడు, The lady who loses her camera…..అన్నీ పాత్రలు ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి.
@ గ్రామాలన్నీ నగరాలు అవకూడదు…..గ్రామాల కనీస అవసరాలు తీరితే చాలు!
It is a satirical comedy-drama and nothing is surreal in this particular movie. I hope this will have some impact on your lovely lives!