రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం 'సీతా స్వయంవరం'. 'స్వయంవరం' అంటే స్వయంవరం నిర్వహించే రాజు యొక్క కూతురు అంటే రాకుమారి, తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకొని పెళ్లిచేసుకుంటుంది. ఐతే వరుణ్ణి ఎంచుకోవడం ఒక షరతు వల్ల కానీ లేక రాకుమారి వరమాల వేసి కానీ ఎంచుకోవడం జరుగుతుంది. సీత దేవి తన బాల్యంలో శివ ధనుస్సును ఆటలాడుతూ అవలీలగా ఎత్తడం చేత వివాహ యోగ్యత వచ్చిన అనంతరం సీత దేవి తండ్రి జనక మహారాజు, పరశురాముని సలహా మేరకు స్వయంవరంలో ఎవరైతే శివ ధనుస్సును ఎత్తి, వింటిని కట్టి, బాణాన్ని సంధిస్తాడో అతనికే సీతనిచ్చి వివాహం జరుపుతానని ప్రకటించాడు..