ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో ఈమె చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సైఫ్ అలీ ఖాన్ తో ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. చివరి 15 నిమిషాల్లో ఎన్టీఆర్, సైఫ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని సీటు అంచున కూర్చోబెడుతాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.