తెలుగు అత్యుత్తమ సినిమాలలో గూఢచారి సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా మన భారతదేశం మీద వున్నా ప్రేమని, దేశభక్తిని రగిల్చింది, భారతదేశంకోసం ప్రాణాలని సైతం లెక్కచేయని గూఢచారుల ధైర్యసాహసాలని, వాళ్ళ తెగింపుని, వాళ్ళ జీవితాలని చూపించిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగులో మరెన్నోరావాలి, మన తెలుగు ప్రేక్షకులు కూడా ఇలాంటి దేశభక్తి సినిమాలని ఆదరించాలి అప్పుడే మరెన్నో మంచి సినిమాలు వస్తాయి. ఈ గూఢచారి సినిమా పరంగా అడివి శేష్ అదరగొట్టేసాడు, ఇతర ముఖ్య పాత్రలు అద్భుతంగా నటించారు, అడివి శేష్ మంచి కథ అందించాడు, అబ్బూరి రవి మాటలు బాగా పేలాయి, శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది-నేపధ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు ఇరగదేసేశాడు, శనేయిల్ సినిమాటోగ్రఫీ బాగుంది, గారి ఎడిటింగ్ బాగుంది, శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే చాలా బాగుంది - దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఘనంగా ఆరంభించాడు-తన దర్శకత్వంతో ఎంతోగానో ఆకట్టుకున్నాడు, ఇంకా ఈ సినిమాకి నిర్మాతలైన అభిషేక్ నమ-విశ్వ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ మంచి చిత్రాన్ని నిర్మించి మంచి అభిరుచిగల నిర్మాతలని అనిపించుకున్నారు. చివరిగా గూఢచారి చాలా మంచి సినిమా, అందరు చూడాల్సిన సినిమా, మంచి దేశభక్తి సినిమా..