దేవదాస్ తరువాత #ANR గారు భక్తి పాత్రలకు న్యాయం చేయగలరా?అన్న విమర్శకుల విమర్శలకు వారి అద్భుతమైన నటనతో సమాధానం చెప్పారు.నాగయ్య గారు త్యాగయ్య చేసేటప్పటికి వారికి 40 సం!
#Vipranarayana చేసేటప్పటికి #ANR 30సం! మాత్రమే,ఆ వయస్సులో అంత గొప్ప నటన అంటే అది సామాన్యమైన విషయం కాదు
భక్తి పాత్రలో పరిచయం ఐ ఆపాత్రలలో మెప్పించటం వేరు! బాలరాజు,దేవదాస్ వంటిచిత్రాలతో లవరబోయ్ ఇమేజ్ వచ్చిన తరువాత భక్తి పాత్రలో మెప్పించటం వేరు! #Vipranarayana పాత్రలో భక్తి,రక్తి రెండు సమపాళ్లలో చూపించాల్సిన కత్తిమీద సాము లాంటి పాత్రని నల్లేరు మీద నడక అన్నంత అవలీలగా చేశారు
#ANR గారికి ఘంటసాల గారి స్వరం లేకుండా సంగీత పరం గా అద్భుత విజయం సాధించిన చిత్రం! మరి ముఖ్యం గా భానుమతి గారి గురించి చెప్పుకోవాలి పాడటమే కాకుండా సంగీత పర్యవేక్షణ కూడాచేశారు ఆమె! భానుమతి గారికి🙏
చూడుమదే చెలియా,సావిరహే పాటలు వింటుంటే చెవులతో అమృతం తాగుతున్నట్లు ఉంటుంది!