చాలా బావుంది. సూపర్ కామెడీ. ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్. సుమారు ఈ ఐదారు ఏళ్లలో మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ చూసిన సినిమా ఇదే. కనీసం 5 నిమిషాలు కూడా ఎక్కడా స్లో అవలేదు. బొర్ అనే పదానికి చోటు లేదు. పాటలు చాలా హుషారు గా ఉన్నాయి. కృష్ణవేణి పాట చాలా కాచి గా ఉంది. కథ అంతా బిగుతుగా అల్లారు. అందరూ తమ తమ పాత్రలు అద్భుతంగా పండించారు. కథను, కథనాన్ని నటుల్ని ఇంత చక్కగా నడిపించిన దర్శకుడు కొండా విజయ కుమార్ కు ఈ సక్సెస్ మంచి బూస్టర్.