అబ్బా!!!!! రంగస్ధలం.....సినిమా చూసి బయటకు వచ్చి వారంరోజులు అయినా ఆ కధ, కధనం నడిపిన తీరు ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉంది. సుకుమారు గారూ!!!! నిజంగా మీరు ఈ సినిమా వెనుక ఎంత కష్టపడి ఉంటారో అని అన్పించింది. నటనలో అయ్యబాబోయ్ రామ్ చరణ్ చింపేసారు.. సమంత సమంతేనా అని అన్పించింది. అందరికి అందరూ నటనలో జీవించారు. మహేష్ చిట్టిబాబు కి గ్రామపంచాయితీలో జరిగిన సంఘటన చెప్పినప్పుడు
ఆతను ఆమాటలు చెప్పటానికి ఎంత యాతన పడ్డాడో నిజంగా చూపించాడు. అనసూయ జగపతిబాబు నరేష్ రేవతి అందరికి అందరూ పాత్రలలో జీవించారు.. పాటలు ఇంక దేవిశ్రీ గారికి తిరుగేలేదు అన్ని పాటలకు అన్నిపాటలూ బ్యాక్ గౌండ్రు మ్యూజిక్ సూపరో సూపర్ !!! వాళ్ళ అన్నయ్య మీదకు దండెత్తినప్పుడు స్టంట్ చాలా బాగా తీసారు..ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం గురించి చెప్పాలి.నేను అందరి సినిమాలు చూస్తాను. ఈ సినిమాకు మట్టుకు రామ్ చరణ్ కు లైఫ్ లో గుర్తుండిపోయే సినిమా!!! అందరికీ ఈ సినిమాకు సంబంధించిన అందరికీ శుభాకాంక్షలు..ముఖ్యంగా సుకుమార్ గారికి.. అవునూ ఇంతకీ ఈ సినిమా కథకు సంబంధించిన టైముకు సుకుమార్ గారు పుట్టారా అని!!!!