నాట్యం ఒక అద్బుతమైన దృశ్య కావ్యం
నాట్యం అనే గ్రామానికి చెందిన సితార(సంధ్యారాజు) గొప్ప నృత్యకారిణి. చిన్నప్పటి నుండి కాదంబరి వింటూ పెరుగుతూ డాన్స్ నేర్చుకున్న సితార పెరిగి పెద్దయ్యాక అందరి ముందు కాదంబరి కథను ప్రదర్శించాలని కోరుకుంటుంది. కాని అందుకు ఆమె గురువు ఒప్పుకోడు. అప్పుడు సితార ఏం చేస్తుంది అనే కథతో రూపొందిన ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. ముఖ్యంగా సినిమాలో నటించిన సంద్యారాజు నటన హైలైట్ గా ఉంది. ఆమె రియల్ లైఫ్ లో కూడా ఒక మంచి డాన్సర్ అవ్వడం వల్ల కథకు ఆమె నూటికి రెండు వందల శాతం యాప్ట్ అయ్యింది. అద్బుతమైన కథను అంతకు మించిన పాత్రల పనితనంతో చూపించి సినిమాను ఒక అందమైన దృశ్య కావ్యంలో చిత్ర దర్శకుడు మలిచాడు. సంద్యా రాజు అందంతో పాటు నటన మరియు డాన్స్ ల్లో టాప్ స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా నటించారు. ఒక మంచి కాన్సెప్ట్ తో పాటు మంచి కమర్షియల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక మంచి సినిమాను ప్రతి ఒక్కరు ఆధరించాల్సిన అవసరం ఉంది... సంద్యారాజు చేసిన ఈ ప్రయత్నంను తప్పకుండా అందరు ఆధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.