భారతదేశంలోని ఎన్నో పల్లెల దుస్థితిని శరవణన్ చిత్రం "Naadu" అద్ధం పట్లినట్లుంది. వారి ఊరికి వచ్చిన డాక్టర్ ను ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలనే వారి తాపత్రయం కొన్ని సార్లు నవ్వించినా ఎక్కువ సార్లు కన్నీరే పెట్టించింది . ముగింపును పల్లెలకే వదిలి వేసిన దర్శకుని ప్రతిభ అద్భుతం. పాపకు మొట్టమొదటి లేడీ డాక్టర్ పేరు ముత్తులక్ష్మి పేరు పెట్టడం ద్వారా "చేపను ఇవ్వకూడదు వాటిని పట్టడం మాత్రమే నేర్పించాలి" అనే చైనా సామెతను డాక్టర్ పాత్ర ద్వారా చెప్పించడం (చూపించడం) అద్భుతం... మనస్సుకు హత్తుకునే ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూడవల్సినదే.....