మల్లేశం సినిమా ఒక మధ్యతరగతి మనిషి లో కల్గిన ఆలోచనకు దానిని సాధించే క్రమములో ఎదురయ్యే అడ్డంకులను కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమా.
తిండికి గింజలు నోచుకోక విషాన్ని తాగి బలవన్మరణానికి బలి అయ్యే చేనేత కుటుంబాలలో
మార్కెట్ కు తగ్గట్లు అవసరమయ్యే వస్త్రాలను నేతవేయడానికి సరియగు యంత్రాలు లేక చేతి లోని కీళ్ళు అరిగిపోయి పక్షవాతం తో చేతులు పడిపోయే
వాళ్ళను చూసి మల్లేషం అనే ఒక పేద చేనేత కార్మికుని మెదడులో కల్గిన ఆలోచన "ఆసు "యంత్రం
ఆ యంత్రం తయారి కోసం ఏమాత్రం ఇంజనీరింగ్ నాలెడ్జు లేని మల్లేషం పడే ఆవేదన, కష్టాలు ,కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ,మరియు తన ఊరి వారి ఎగతాళిని సైతం లెక్కచేయక చివరికి యంత్రం తయారు చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు.
మల్లేషం పాత్ర లో ప్రియదర్శి జీవించాడు.
కథానాయిక కూడా చాలా బాగా చేసింది.
హీరో తల్లిగా ఝాన్సి కూడా చాలా బాగా చేసింది.
సినిమా మెుదట్లో తెలంగాణ యాసలో (సినిమా కూడా పూర్తిగా) మా అందరికీ మళ్లీ మా పల్లెటూరి బాల్యాన్ని గుర్తు చేసి మా జ్ఞాపకాలను నెమరువేసుకునేటట్టు దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు.
చివరగా ఈ సినిమాకు రేటింగు 5/5.