నేను అసలు ఈ రివ్యూ రాయాలి అని అనుకోలేదు కానీ మన డార్లింగ్ ఏలాంటి స్టోరీ ఎలా సెలెక్ట్ చేసాడో అర్ధం కావటం లేదు....మూవీ ట్రైలర్ లో చాలా ఎలివేషన్స్ చూపించారు కాని సినిమా లో అంత ఏమి లేదు. ఇంకా కథ లోకి వెళితే చాలా సన్నివేశాలు పూర్తిచేయలేదు. విక్రమ్ ఆదిత్య చాల ప్రముఖ జ్యోతిష్యుడు గా చూపిస్తారు కాని సినిమా మొత్తంలో కేవలం 5 సార్లు మాత్రమే జ్యోతిష్యం చెప్తాడు. విక్రమ్ ఆదిత్య చెయ్యి చూసి చెప్తే జ్యోతిసుడిగా చూపిస్తారు. ప్రభాస్ ఇండియా వదిలి ఎందుకువెళ్లిపోతాడో సరిగ్గా చెప్పలేదు. కేవలం రెండు దృశ్యాల కోసమే మాత్రమె జగపతి బాబు గారు ఉంటారు. ఇంకా ఒక ప్రేమ కథ అని కూడా చెప్తారు కానీ. సినిమా లో ఆహ్ కెమిస్ట్రీ హీరో హీరోయిన్ మద్యలో కనిపించదు. సినిమాలో జ్యోతిష్యం గురించి కూడా అంత గోపద చూపించలేదు. చాల సన్నివేశాలు పూర్తి చెయ్యలేదు అనిపించాయి.