చాలా బాగుంది చిత్రం.
చూసేంత సేపు మన గతాన్ని చూపిస్తుంది..
నరసింహ చనిపోవడం, అతని చావు సన్నివేశాలు హృదయం ఉన్న ప్రతి వారిని కదిలిస్తుంది.
కథ, కథనం అద్భుతం.
గోదావరీ యాసని, ఎటకారం చెయ్యకుండా తీయడం మంచి విషయం.
పెద్దోడు యాస, అతని అమాయకత్వ నటన చిత్రాన్ని ఇంకో మెట్టు ఎక్కించాయి.
మొదట రిజర్వేషన్ లాంటి సున్నిత అంశాలను ఎందుకు పట్టుకున్నాడు అనుకున్నా.. చివర సుబ్బు నరసింహ తండ్రి పట్టుకున్నకా కులం కన్న మానవత్వం గొప్పది అని చూపించడం హర్షనీయం.
విలియం తను ముద్దుపెట్టిన అమ్మాయిని పెళ్లి చేస్కుని ఉంటే బాగుండు అనిపించింది.
ఎలక్షన్ ప్రచారం లో మాటలు బాగా రాశారు.
ఓటర్లను ఒక ఆట ఆడుకున్నారు.
శివ గెలిచింటే బాగుండేది కాదు,
చివర బాల్యం యవ్వనం ప్రస్తుతం మూడు ఒక ఫ్రేమ్ లో చూపించడం ఎంతో తృప్తిగా అనిపించింది...
C/O కంచెరపాలెం తరువాత అంతలా నచ్చిన చిత్రం ఇదే.
అన్నింటినీ ఒక్క తాటి మీదకు తీసుకొని వచ్చిన దర్శకుడు యదు వంశీ గారికి అభినందనలు