దర్శకత్వం, స్క్రీన్ప్లే అమోహం. సావిత్రి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని, నటనాపరంగా వారిని విమర్శించే అర్హత ప్రస్తుతం ఎవరికీ లేదు. ఆమె స్వవిషయాలు అంతగా తెలియక పోయినా, వారికి ఉన్న దాన గుణం అనే వ్యసనం మాటున, అందరూ మోసం చేసారని చెప్పు కొనేవారు. విని బాధ పడేవాళ్ళం. ఈ మహనటి సినిమా ద్వారా ఓ వ్యక్తి యొక్క చరిత్రను ప్రజలకు ఎలా తెలియజేయవచ్చు అనే కోణంలో “గాంధీ” (ఇంగ్లీషు) సినిమా సరసన తెలుగు సినిమా చేరిందనే చెప్పు కోవచ్చు.
ఇంకో కోణంలో, ప్రస్తుతం సినిమా నటుల్లో ఎవరైనా, ఇతరులకు సహాయపడే గుణం ఎక్కువ పాళ్లలో ఉంటే, సావిత్రి గారిని ఉదాహరణగ చెప్పి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం, అపుడపుడూ వింటూ వుంటాం. అసలే ప్రాంతీయ నటీ నటులు కరువైపోయి, మన ప్రాంతం కాని వారికి మనమెందుకు సహాయపడాలనే నటుల ఆలోచనలకు మరింత బీజం నాటి నీరు పోసిందీసినిమా అనటంలో అతిశయోక్తి లేదు.
కానీ నలుగురు మన వెనుక నడవాలి అంటే, మహనటిలా జీవించాలి. వున్నంతలో ఎదుటివాడికి సహాయపడడం నీ ధర్మం. అదే వ్యసనంగా మారితే నీ కర్మం.