Lokkhi Chhele (An angel's kiss)
Humanity should be the only religion. (సృష్టిలో ఉండాల్సిన ఒకే ఒక మతం, మానవత్వం)
లోఖీ ఛేలే, బెంగాలీ మూవీ (SonyLiv లో తెలుగు లో ఉంది). గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న సామాజిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడి, బ్రాహ్మణుల అధీనంలో ఉన్న ఒక గ్రామంలో , ఒక చిన్న పిల్ల జీవితంలో మార్పు తీసుకురావడానికి నరకయాతన పడిన ఒక యువ వైద్యుడి జీవితం.
అమీర్ హుస్సేన్, శివనాథ్ దత్తా & గాయత్రి ఛటర్జీ ముగ్గురు స్నేహితులు, మెడిసిన్ చదువుతున్నారు. ఒక ట్రిప్ నుండి తిరిగి వస్తుండగా, వారి కారు చెడిపోతుంది. దీంతో సమీపంలోని లాడ్జిలో గది అద్దెకు తీసుకుంటరు. అక్కడ జర్నలిస్టు జాయ్ మిత్రను కలుస్తరు. చుట్టుపక్కల ప్రాంతంలో నాలుగు చేతులతో ఆడపిల్ల పుట్టిందని తెలిసి మిత్రతో కలిసి వెళ్తరు. స్థానిక ప్రజలు ఆమెను లక్ష్మీ దేవి పుట్టింది అని భావించి పూజించడం మొదలు పెడతరు, అదే అదనుగా బ్రాహ్మణులు పాగా వేసి సొమ్ముచేసుకోడం కూడా మొడలైపొద్ది. ఈ క్రమంలోనే ఆమిర్ & ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి జ్వరం, ఆరోగ్య సమస్యలు గుర్తించి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంటరు. ఈ లక్షీతో ఆమిర్ కి ఉన్న అనుబంధం, ఆ పాపని కాపాడడానికి ఆ ఫ్రెండ్స్, మిత్ర, డాక్టర్ కపుల్ పడిన పాట్లు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
మూఢనమ్మకాలను మరియు మానవత్వాన్ని ఏకకాలంలో చూపించిన సినిమా డైరెక్టర్ కౌశిక్ గంగూలీకి ఒక వెయ్యి హగ్గులు ఇచ్చినా తక్కువే. ఆరోగ్యకరమైన జీవితం ప్రతి జీవి హక్కు అని గుర్తుచేసే సినిమా.
కథ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. అందరికి అందరు సహజంగా పాత్రతో కలిసిపోయినట్లే జీవించారు.
మొత్తానికి నాకు బాగా నచ్చింది. మస్ట్ వాచ్.