పరమ సోది సినిమా. అసలు రామ్ చరణ్ గాని చిరంజీవి గాని ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నారు చాలా ఆశ్చర్యం కలుగుతుంది . బోయపాటి నీకు దండం స్వామి ఇలాంటి సినిమాలు పెద్ద హీరోలతో తీయకు వాళ్ల ఇమేజ్ పోయేలా ఉంది. అసలు ఏంటి సార్ ఒకటే కొట్టుకోవడం,కాల్చుకోవడం లేదా పొడుచు కోవడం .
రామ్ చరణ్ లుక్ అంత ఇంప్రెసివ్ గా చూపించలేదు, అంటే కనీసం ఇంతకుముందు సినిమాలో ఉన్నట్టుగా కూడా లేడు. ఈ సినిమాలో బాగుంది డాన్స్. గుడ్డిలో మెల్ల అదే. దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తే కచ్చితంగా బాగుంటది ఈ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. బోయపాటి గారు దయచేసి ఇంకొకసారి ఇలాంటి స్టోరీలు ఉంటే సినిమాలు తీయకండి. ఊరకనే బడ్జెట్ పెంచి కాస్టింగ్ టూ మచ్ పెట్టి హంగామా హంగామా చేసి తీయకండి సార్. ఇతర నటులకు డైలాగ్స్ కూడా లేవు.
షార్ట్ ఫిలిం లో కూడా ఇంకా సీరియస్ గా ఉంటాయి, బీహార్ లో తీసిన కొన్ని సన్నివేశాలు అంతకంటే దారుణంగా ఫన్నీగా ఉన్నాయి.
సినిమా వచ్చిన ఇన్నాళ్ళకి నేను ఇది చెప్తున్నానంటే కారణం రామ్ చరణ్ మీద అభిమానం ఉన్నప్పటికీ నేను ఇప్పుడే చూశాను. చాలా చాలా చాలా నిరాశకు గురయ్యాము.