Now I'm 76 years.....
Watching movies from ticket 25 paisa (పావలా) to Rs. 900
ఎన్నో సినిమాలు పౌరాణికం, సాంఘీకం, కామిడీ,
రకరకాలు.
తాతలు హీరోలు
కొడుకులు హీరోలు
మనవళ్ళు హీరోలు
చూసాను.
అందర్నీ
చూస్తున్నాను.
కొందరిని.....
బతికి బాగుంటే.....
చూస్తాను రాబోయే కొత్త హీరోలని, హీరోయిన్లని.
భరతనాట్యాలు, క్లబ్ డాన్సులు
ఐటమ్ సాంగ్స్.
దేన్ని ఏరకంగా ఆనందించాలో, ఆనందించాను.
హీరో కోపానికి చెయ్యి బిగిస్తే.....
నరాలు ఉబ్బిపోయి పగిలిపోతాయేమో అని
ఎలాగరా భగవంతూడా అని భయపడిపోయిన
సందర్భాలు కోకొల్లలు.
క్లబ్ డాన్స్ చూస్తున్నప్పుడు, ఆక్లబ్ లో, ఓమూల టేబుల్ దగ్గర నేనూ కూర్చొని వుంటే.....
అని అనిపించింది.
ఐటమ్ సాంగ్ మంచి పట్టుమీద ఉన్న ఝట్టం లో
కాసేపు హీరోని పక్కననెట్టి..... (దురాలోచన దూరేది)
ఏంటిదంతా ఈ వయస్సులో....
చివరికి తెలిసింది.
సినిమా అంటే అంతే.
వయస్సుతో పనిలేదు సినిమాకి.
డ్యూయెట్ పాటుండాలి.
ఫైటింగ్ తప్పనిసరి.
ఐటమ్ సాంగ్ అత్యవసరం.
కామిడీ వుండనేవుండాలి.
పైవన్నీ
అఖరలేదు.
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే.....
నిజంగా ఇవన్నీ అవసరం లేకుండా అద్భుతంగా తీసిన సినిమా మ్యూజిక్ షాపు మూర్తి.
మాంచి సినిమా ఎలా తీయాలో
తీసి చూపించారు.
మనస్సున్న మనిషిని ఓసారి మేలుకొలుపే మంచి సినిమా.
ఎవరు బాగా యాక్ట్ చెయ్యలేదో చెప్పటం కష్టం.
నాకు కొంచం ఇబ్బంది కలిగించిన విషయం
"అధికం అయిన బ్యాక్ గ్రౌండ్ పాటలు"
పట్టున్న మంచి కథకు అడ్డంకి అయ్యాయి ఈ పాటలు.
అజయ్ గోష్ శభాష్ !!
డైరెక్టర్ గారికి హ్రృదయపూర్వక అభినందనలు.
🙏🙏🙏
బాలాజీ దాకోజు
బెంగుళూరు