ఈ సినిమా ఈ వేసవిలో చల్లని చిరు జల్లులా (చిరునవ్వు లా) ఉంది, ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితికి చాలా దగ్గరగా ఉంది. కధ, కధనం చాలా బాగున్నాయి, డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యారు. నరేష్ నేచురల్ గా నటించారు. కధలో పెళ్ళి వయసు వచ్చి అది దాటిపోతుంటే అబ్బాయి ఎలా ఉంటాడు అలానే జీవించాడు. పొగడడం కాదుకాని నరేష్ ప్రతి సినిమాలోను తన పాత్రకు నూటికి 99% జీవం పోస్తారు. హీరోయిన్ ఈ కాలపు అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఆయా సందర్బాలకు సరిపోయే విధంగా నటించింది. ప్రతి ఒక్కరి నుండి దర్శకుడు మంచి నటన రాబట్టారు. అలాగే మిగిలిన పాత్రలు తమ పరిధిలో మమ్మల్ని ఆకట్టుకున్నాయి. కధ ఇప్పటి అబ్బాయి, అమ్మాయిలు, తల్లిదండ్రులకు ఖచ్చితంగా సరిపడే సినిమా కధ ఇది. ఒక రకం గా చెప్పాలంటే ఎంతో సున్నితమైన సమస్య ఇది ప్రస్తుతం అన్ని ఉండి, పెండ్లికాని అబ్బాయిలు పరిస్ధితి ఎలా ఉందో చక్కగా చూపించారు. సినిమా ఆశాంతం(మొత్తం) కధ, కధనం బాగున్నాయి. ప్రస్తుత అభూత కల్పనల మాయలో కాకుండా నిజాయితీగా నిజాన్ని చాలా పద్ధతిగా వివరించారు. ఇది నిజమైన జీవితంలో ముఖ్యంగా పెళ్ళి కాబోయే నూతన వరులకు చాలా ముఖ్యమైన సినిమా.