ఎవరు’ సినిమా ప్రశ్నలతోనే మొదలౌతోంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ‘ఎవరు’ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్‌గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి కథ కొసరంతే ఉన్నా.. కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంటాయి. ఈ ‘ఎవరు’ కథ కూడా ఈ కోవలోనిదే. కథ మొత్తం స్క్రీన్ ప్లే మాయాజాలంతో సాగుతుంది.