ఎంతో అద్భుతంగా ఉంది. కృష్ణవంశీ గారు మళ్ళీ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
తల్లిదండ్రులను పిల్లలు ఎలా చూసుకోవాలి అనే దానిపై ఆధారపడి కథ ఉంటుంది.
రంగమార్తాండ రాఘవరావు తను స్టేజ్ ఆర్టిస్టుగా విరమణ తీసుకొని శేష జీవితాన్ని భార్యా పిల్లలతో హాయిగా గడపాలనుకుంటాడు కానీ ఈ తరం పిల్లలతో కలిసి మన లేక, వారికి పిల్లలకి మధ్య జరిగే సంఘర్షణ అద్భుతంగా చిత్రీకరించారు.
ధనం ముఖ్యమా సంబంధాలు ముఖ్యమా, సమాజంలో ఎటువంటి విలువలు పాటించాలి ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలపై చాలా చక్కగా తెరపైన చూపించారు.
ప్రతి ఒక్కరూ చూడవలసిన అద్భుతమైన చిత్రం, మున్ముందు ఇటువంటి చిత్రాలు వస్తాయో రావో చెప్పడం కష్టం, కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు.
సినిమా బడ్జెట్ విషయంలో కొంత ఇబ్బందికి తెరపైన కనిపిస్తుంది. ఇంకొంచెం బడ్జెట్ ఉంటే సినిమాన ప్రమోషన్స్ బాగా చేసి ఉండొచ్చు.