#Amrutharamam థియేటర్ లు లేని ఈ సమయంలో జీ5 లో రిలీజ్ ఐన అమృతరామమ్ చాల చక్కగా రూపొందించిన ప్రేమ కావ్యం👍 చక్కటి సంగీత నేపధ్యంలో, తక్కువ పాత్రలతో, కొంచెం కొత్త తరహాలో హృద్యమైన ముగింపుతో, ఆస్ట్రేలియా అందాలని రమ్యంగా బంధించిన కెమెరా నైపుణ్యంతో, వెండి తెరపై మాత్రమే చూస్తే బాగుండుననిపించింది. చక్కని అభినయంతో కథానాయిక అమితారంగనాధ్, అందమైన విగ్రహంతో ,పాత్రోచిత ప్రదర్శన తో కథానాయకుడు రామ్ మిట్టకంటి, హృద్యమైన నేపధ్య సంగీత కూర్పుతో ఎన్. ఎస్. ప్రసు, దర్శకుడు సురేంద్ర కొంటాడ్డి రమ్యమైన దర్శకత్వంలో, చివరిగా మళయాళ తెలుగు యాసతో ఆకట్టుకనే ఉత్తమ్ పాత్రధారి..... మొత్తానికి మంచి సినిమా చూసిన బావనను కలిగించింది...