The Color of Paradise
(ఇరానీ సినిమా)
******
ఏమైంది...? నువ్వేడుస్తున్నావా..?
ధీరులు ఏడువరూ తెలుసా...!!!
ఇంట్లోవాళ్ళు గుర్తొచ్చారా..?
లేదు...
మరి...
నన్నెవరూ ఇష్టపడరు... చివరకు మా నానమ్మ కూడా...😢
నాకు కళ్ళు కనపడవని ....అందరూ నాకు దూరంగా ఉంటారు....!😢
నాకే కళ్ళుంటే... అందరితోపాటే నేనూ బడికి పోయేవాన్ని..
ఇప్పడు నేను అంధుల పాఠశాల్లో చదువుతున్న..😢😢😢
పైగా .. దేవుడంటా గుడ్డివాళ్ళకి కళ్ళు కనపడవని వాళ్లనే ఎక్కువ ఇష్టపడతాడని మా టీచర్ అంటారు..😢😢😢😢
నేను టీచర్ తో అన్నా.. మనను ఎక్కువ ఇష్టపడితే మనని అంధులుగా ఎందుకు పుట్టించాడు ...?😢😢😢 అందువల్లే కదా మనం దేవుణ్ణి చూళ్ళేకపోతున్నాం..😢😢😢😢
టీచర్ అన్నాడు.. "దేవుడు నిరాకారుడు కనిపించడు"😢 .. తనూ సర్వాంతర్యామి, తనని మనం కేవలం అనుభూతి చెందాలి...😢😢 తనని నీ మునివేళ్ళతో నువ్వు చూడొచ్చు...😢😢
అప్పటి నుండి దేవుడికి నా బాధలను చెప్పాలని, నా హృదయ రహస్యాలను పంచుకోవాలని.. ప్రతి చోట నా చేతులతో తడుముతున్న....😢😢😢😢
నీ ఉపాధ్యాయుడు నిజం చెప్పాడు...
*****
ఇది పై సినిమాలో ఒక అంధ వడ్రంగి మరియు లీడ్ రోల్ చేస్తున్న అంధ బాలుడి(మహమ్మద్) మధ్య జరిగిన సంభాషణ..
ఇంకో సందర్భం లో మహమ్మద్ తన నానమ్మతో అంటాడు ....నానమ్మ నీ చేతులు ఎందుకు తెల్లగా ఉన్నాయి..? ...
అప్పుడు నాకర్థమైంది డైరెక్టర్ మజీద్ మాజిది ఎందుకు ఈ సినిమాకు The Color of Paradise అని పేరు ఎందుకు పెట్టాడని..!!!
హృదయాన్ని హత్తుకునే ఈ సినిమా గురించి చదవడం కన్నా చూస్తే బాగుంటది..
అంధ బాలుడిగా Mohsen Ramezani నటన అత్యాద్బుతం..!!!
ఈ వేసవిలో పిల్లలకు చూపించాల్సిన సినిమా... !!!
అనిల్ బత్తుల రాసిన పిల్లల సినిమా కథలు పుస్తకం లో 12 సినిమా ఇది..