*వాల్మీకి 2.5/5*
*అంతరిక్షం, ఫిదా,తొలిప్రేమ,F2* లాంటి కొత్త కధలు, సరికొత్త కధనాలతో జెట్ స్పీడ్ తో వెళుతున్న *వరుణ్ తేజ్* కెరీర్ ఈ సినిమా అనే స్పీడ్ బ్రేకర్ ను తాకి నెమ్మదించింది.
అయితే ఈ సినిమా విజయావకాశం ఎంత వరకు ఉంటుదనేది ప్రక్కన పెడితే వరుస క్లాస్ ప్రేమకథల తరువాత ఒక మాస్ కధ *వాల్మీకి o/o గద్దలకొండ గణేష్* పాత్ర నటన, హావభావాలు, శరీర బాష, అలంకరణ కొత్తగా ఉండడంతో *మెగా ప్రిన్స్* భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
వరుణ్, పూజాల మధ్య వచ్చిన సన్నివేశాలు తప్ప మిగిలిన సినిమా అంతా సాగదీసి ప్రేక్షకులు సహనాన్ని పరీక్షిస్తాయి. అభిమానులు ఈలల గోల మధ్య *వెల్లువొచ్చి గోదారమ్మ* పాట ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ కొంతమంది అభిమానులను కూడా థియేటర్ నుండి బయటకు పంపేసింది.
దర్శకుడు కధ, కధనం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అవసరం లేని సన్నివేశాలు కనీసం అరగంట వరకు ఉంటాయి.నిర్మాతలు నష్టాన్ని భరించక తప్పదు.
మరో హీరో అధర్వ, హీరోయిన్ పూజా హెడ్గే తప్ప మిగతా పాత్రలను గుర్తుపెట్టుకోరు ప్రేక్షకులు.