ఈ సినిమా చాలా చాలా బాగుంది.
1. విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారం గా మారిపోయింది. విద్యా వ్యవస్థ ను ఏలుతున్న వారు ఎలా ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేస్తున్నారు అనే అంశం.
2. ఒక నిజమైన టీచర్, విద్యార్థుల భవిష్యతే తన భవిష్యత్ గా భావించే ఒక గొప్ప టీచర్ కథ ఈ సినిమా.
3. నిజాయితీ గా విద్యార్థుల కోసం కష్టపడితే ఆ టీచర్ ను దేవుడితో సమానం గా ఎలా కొలుస్తారో చెప్పిన సినిమా ఇది.
4. నాడు మరియు నేడు డబ్బులు లేక - విద్యకు దూరమౌతున్న అద్భుతమైన ప్రతిభ కలిగిన విద్యార్థుల జీవితమే ఈ సినిమా..
5. ఒక టీచర్ ఈ సమాజానికి ఏమి చెయ్యగలడు, ఎందుకు టీచర్ ను సమాజాన్ని మార్చే శ్రామికుడు అంటారో చెప్పిన సినిమా ఇది.... అద్భుతం గా ఉంది.... కచ్చితంగా చూడండి...... ఒక టీచర్ హృదయం మనకుంటే తెలియకుండానే కన్నీళ్ళొచ్చే సినిమా ఇది........