రాజుగారి గది ఏమాత్రం చూడదగిన సినిమా కాదు. సినిమాకు ఉండే కామన్ సెన్స్ కూడా ఇందులో లేదని చెప్పొచ్చు. సుడో సైన్సు తో మెంటలిస్టు అనే అశాస్త్రీయ క్యారెక్టర్ ను సృష్టించడంతో పాటు చూసే ప్రేక్షకులు సన్నాసులనే ధీమాతో తీసిన చిత్రమిది. చివరకు నాగార్జున కూడా దెయ్యాలను నమ్ముకుని దేకరాల్సిన పరిస్తితి రావడం విచారించాల్సిన విషయం. విజ్ఞత కల్గిన ప్రతిఒక్కరూ ఇటువంటి చవకబారు చిత్రాలను ఖండించాలి. చిన్నసమస్యకు కూడా ఆత్మహత్య పరిష్కారమని ఇటువంటి చిత్రాలు చెప్పడం వల్లే ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. వాస్తవికత అసలు లేని పరమ బోరింగ్ చిత్రమిది.