ఏ సీన్ ఎప్పుడు జరుగుతోందో, ఎక్కడ జరుగుతోందనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా రాసుకున్న నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే... అసలే చిందరవందరగా వున్న దానిని మరి కాస్త అస్తవ్యస్తం చేసేసింది. హీరో ఫ్రేమ్‌లోకి వస్తే రాళ్లు పగలగొట్టుకుని రావాలి, విలన్ ఎంటర్ అయితే దుమ్ము రేగుతుండాలి, ప్రతి ఆర్టిస్ట్ ముఖమ్మీద ప్రొపెల్లర్లు అదే పనిగా వెయ్యాలి... అంటూ ఖచ్చితమైన షరతులు పెట్టుకుని మరీ సన్నివేశాలని డిజైన్ చేసినట్టుంది.