ఇంటి పెద్దలతో బంధం ఓ గొప్ప వరం - ఆ వరాన్ని ప్రతి ఒక్కరూ స్వంతం చేసుకోవడం అవశ్యం అన్న మాటకు మంచి ద్రుశ్యరూపం ఈ చిత్రం .
కాకపోతే కథలోని ప్రధాన పాత్రలు బేబీ బామ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఆమె లేని లోటును స్వయంగా గుర్తించే సంఘటనలు - తెలియ చెప్పే ద్రుశ్యాలు కథలో బలంగా లేకపోవడం కచ్చితంగా లోటే .
లక్ష్మి గారు , రాజేంద్ర ప్రసాద్ గారు, సమంత ఎప్పటిలా బాగా నటించారు .
ఐతే ఇటీవలి చిత్రాలలో సమంత నటనలో ఎక్కువ భాగం అమల గారు కనిపిస్తున్నారు . ఓ రకంగా అమల గారి హావ భావాలను సమంత పూర్తిగా అనుకరిస్తోంది అని అనక తప్పదు .
ఈ సినిమాలో రావు రమేష్ గారి నటన చూసే వారికి ఇంట్లో పెద్దల విలువను తెలిసేటట్లు చేసి కంట నీరు తిరిగేలా చేస్తుంది .
మొత్తం మీద OH బేబీ ..... OK బేబీ మాత్రమే కానీ సూపర్ బేబీ ఐతే కాదు - nads 🌹