2018 సంవత్సరానికి ఒక గొప్ప సినిమా ని అందించిన డైరెక్టర్ నాగ అశ్విన్ కి మనందరం కృతజ్ఞతలు చెప్పాలి. తెలుగు లో చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో నాగ అశ్విన్ ఒకరిగా చేరారు. 100 సంవత్సరాలు, అన్ని తరాలు గుర్తుంచుకునే ఆక అద్భుతాన్ని మనకి అందించారు. "మహానటి" పేరు కి తగ్గట్టుగా సావిత్రి గారి వ్యక్తిగత చరిత్ర ని చాలా చక్కగా తెరకెక్కించారు. గత 10 సంవత్సరాల నుండి టైటిల్ ఒకటైతే సినిమా మరో రకంగా ఉండేవి. అలాంటిది టైటిల్ కి తగ్గ సినిమా ఇప్పుడు మాకు చూసిన అనుభవం తృప్తిని కలుగజేసింది.