నేను ఎక్కడో రాసేను అర్జున్ రెడ్డి సినిమా వచ్చాక కృష్ణారెడ్ది సినిమాలకు కాలం చెల్లిందని! అర్జున్ రెడ్డి, RX100 లాంటి సినిమాలు హిట్ అయ్యాక - పనికి మాలిన సినిమాలు చేసినవాడే పెద్ద హీరో. అర్జున్ రెడ్డి పాత్ర కోసం అర్రులు చాస్తున్న హీరోలలో ఒకడిని (వరుణ్ తేజ) అటువంటి పాత్రకు ఒప్పించి, పిచ్చి పిచ్చిగా తీసిన సైనిమా గణేష్. తెలంగాణలో కుడా హిట్ అవ్వాలని సగం పాత్రలు పాత్రోచితం లేకుండా తెలంగాణ యాసలో మాట్లాడుతుంటాయి. సినిమాలో హీరో 1978-83 లో హిరోయిన్ ని ప్రేమించి, ఫెయిల్ అవుతాడు. అంటే సినిమాలో హీరో కు 2018 నాటికి 55 ఏళ్లు పైమాటే. ఎందుకంటే రంగస్థలం గురించి, సిగరెట్ ప్యాకెట్ ఖరీదు గురించి మాట్లాడుతారు. సినిమా అంతా గందరగోళంగా, అసహ్యంగా వుంది. గెడ్డం పెంచుకొని విలన్ గా నటించడానికి అంత వేలం వెర్రి ఏమిటో? హిట్ అయిన తమిళ కధ చెప్పి, డైరెక్షన్ చాన్స్ కొట్టేసాడు హారిశంకర్. కధ : మణిరత్నం మౌనరాగం ని పోలి వుంటుంది. అలాగే దేవత లో పూర్తి enhanced song ని మళ్ళి రీమిక్స్ చెయ్యడం షోలే ను మళ్ళి తీసినట్లుంది. To be honest క్రాక్ సినిమా. అయినా సిగరెట్ కాల్చడం ఫ్యాషన్ ఏమేటో?