ఈ సినిమా పేరుని పాత సినిమా పాటలోని మొదటి చరణం "నన్ను దోచుకుందవటే" వన్నెల దొరసాని.... నుండి యెంచుకోవడం జరిగింది. బాగుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు మరియు నబ్బా నటేశ్ నటన చాల బాగుంది. నాజర్ నటన బాగుంది. తల నెరిసినా మీసం నల్లగా ఉంచడం ఏం బాలేదు. సుధీర్ డాన్స్ బాగా చేసాడు. డైలాగుల్లొ కొన్ని కంటిి తడి పెట్టించాయి. కొన్ని డైలాగులు కడుపుబ్బా నవ్వించాయి. నబ్బా నటన short film heroine గా చాలా పెర్ఫెక్టగా వుంది. పాన్ షాపు ప్రారంభం దృశ్యం సుపర్బ్. ఈ సినిమా కూడా, నిజంగా ఒక short film చూస్తున్న అనుభూతి కలిగింది. మిగతా నటీనటులు కూడా వారి పరిధిలో బాగానే నటించారు. కొస మెరుపేంటంటే హీరోకి తల్లి లేకపోవడం, హీరోయిన్ కి తండ్రి లేకపోవటం.