రోమాలు నిక్కపొడ్చేలా సీన్లూ తీయలే, కన్నీళ్లోచ్చేంత సెంటిమెంటు పండించలే, ఎటూ చూసినా హీరోని హైలైట్ చేసే సీన్లే కానీ నరాలు తెగే ఉత్కంఠ యాడా అన్పించలా...
రాకీ ఎంట్రీ స్ట్రాంగా ఉన్నా గదిలో సింహాసనంపై కూర్చుని మిగతా వాళ్ళని డామినేట్ చేస్తున్న సీన్ వెయిట్ ఏం లేదు..
బంగారం తీస్తున్నది, ఎటెల్తున్నది, అమ్ముతున్నది, రాజకీయ నాయకులని కమ్ముతున్నది ఏదీ కూడా క్లియర్‌గా చూపెట్టలేకపోయారు..
KGF-1 నుండీ ఇనాయత్ ఖలీల్, రమైకా సేన్ అనే పాత్రలని పవర్‌ఫుల్‌గా KGF-2 రిలీజ్ వరకి ట్రైలర్లో టీజర్లలో చూసిన సగటు సినీ అభిమాని లోట్టలేసుకుని సినిమాకి వెళ్తే లొట్టపీసంత స్ట్రాంగూ లేదు వాళ్ళ పాత్రలు..
సంజయ్‌దత్ యశ్ ల ఫైటింగ్ మాత్రం కట్టిపడేసింది..
KGF-1👌KGF-2
3/5