#అర్ధ #శతాబ్దం
అంబేద్కర్ సాక్షిగా మొదలై అంబేద్కర్ సాక్షిగా ముగిసిన సినిమా..
ఎంత గొప్ప నాయకుడైనా, ఎంతటి ఉద్యమకారుడైనా, కమ్యునిస్టుయైనా అంబెడ్కరిస్టుయైనా తన దాకా రానంత వారకే మనమంతా ఒక్కటీ...
కాదని ఒక్కసారి తన దాకా వస్తే నాయకత్వం పక్కన పెట్టి, ఉద్యమం పక్కన పెట్టి, కమ్యునిజం & అంబేద్కరిజం పక్కన పెట్టి #కులమే ప్రాముఖ్యమనే సమాజంలో మనం ఉన్నాం అనే సందేశంతో...
#రాజ్యాంగం అర్థం చేసుకున్న నాడు కులాలు అన్ని పోయి, మనుషులంతా ఒక్కటవుతారు అనే ఆశను కల్పిస్తూ...
"మన పక్కన తిరిగేటోడు వేరే కులమైనా పర్వాలేదు, మన పోరగాళ్ళ పక్కన పడుకునేటోడు మన కులపోడు అయుండాలే" అనే థీం తో...
#తెలంగాణ యాసలో ఆసక్తికరమైన #స్క్రీన్_ప్లే తో నడిచిన ఫేయిల్యుర్ ప్రేమకథా చిత్రం ఈ #అర్ధ_శతాబ్దం
రాజ్యాంగం పట్ల ఇంకొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం చేసుంటే ఇంకా బాగుండేది..
కొన్ని లాజిక్స్ మిస్సైనా ఓవరాల్గా ఈ సినిమా నాకైతే నచ్చిందీ...
Rating: 3.0 ⭐⭐⭐ ఇస్తాను