ప్రేమ వేరు.. యుద్ధం వేరు. కానీ కొన్నిసార్లు ప్రేమ కోసం యుద్ధం చేయాల్సివస్తుంది. ఇంకొన్నిసార్లు.. యుద్ధంలోనూ ప్రేమ కనిపిస్తుంది. ఆ రెండూ కలిస్తే – సీతారామం. ప్రేమ, యుద్ధం అనే రెండు వేర్వేరు నేపథ్యాల్ని కలిపిన ఉత్తరం – సీతారామం. దేశాన్ని ప్రేమించే ఓ సైనికుడికి – దేశమంత ప్రేమని ఆ సైనికుడిపై ధారబోసే ఓ అమ్మాయికీ మధ్య జరిగిన ప్రయాణం.. సీతారామం. ❤