చాల చక్కని సాధారణ భాష, 42 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, ఎప్పుడు మన కాళ్ళ ముందే జరుగుతున్నట్టు చూపించారు. ఆ రోజులలో అణగారిన వర్గాల ప్రజల అమాయకత్వాన్ని అగ్రవర్ణాల సౌకార్లు శ్రమదోపిడి ఎలాజరిగిందో చక్కగా చూపించారు. వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, బలవంతుడు బలహిఈనుడిని ఎలా వాడుకుంటాడో చూపించారు. అగ్రవర్ణాల పెత్తనం బలహీన వర్గాల పైన ఈవిధంగా ఉందొ, వాళ్ళ అస్థిత్వాన్ని ఎలా కోల్పోయారో, అలాగే చివరిలో ఎలా మారారో చూపించారు. సినిమా ముగింపులో అంబెడ్కర్ భావజాలం చాల బాగా తెరకెక్కించారు. ఏ సినిమాలో ఎక్కడ కూడా విసుగొచ్చే సీన్ లేదు, కుటుంభం తో కలసి చూడవచ్చు. చరిత్ర తెలువని వాడు చరిత్రని సృష్టించలేదు అనేది నా భావన. సినిమా యూనిట్ మొత్తానికి న హృదయపూర్వక అభినందనలు.