బోయపాటి మెదడు ఖరాబైంది. ఒక R 18 ఫైట్ (అంటే తలలు, చేతులు తెగి పడడం), ఒక గ్రూప్ డాన్స్, మధ్యలో కొన్ని సీన్స్.
కొత్త కథ లేదు. ఇలాంటివి వందల కొద్దీ సినిమా కథలు వచ్చాయి.
తేడా అల్లా బోయపాటి మార్కు భయానక మైన ఫైట్లు.
సినిమా ఎప్పుడైనా గెలిచేది సరైన లాజిక్ తోనే. ఫైట్స్ అంటే ఖుషి (పవన్) సినిమాలో లాగా ఉండాలి. ఒక్కడు 100 మందిని చంపడం చూసాం కానీ పోలీస్ డీజీపీ దగ్గర్నుంచి, గ్రే హౌండ్స్ వరకు 100 మంది ఆ టోమేటిక్ గన్స్ తో వస్తే మన హీరో ఒక్కడే అందర్నీ చంపేస్తాడు.
ఇంతలా చెత్త ఎక్కడా లేదు. వినయ విధేయ రామ ఫ్లాప్ అయినా, ఆ పద్ధతి కథ బోయ పాటి మార్చుకోలేదు. ఇద్దరు సీఎం లను బ్లాక్ మెయిల్ చేసే హీరో ఏ ప్రేక్షకుడి బుర్రలోకి కూడా సింక్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక తమన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మైసూర్ పాక్ తలచుకుంటే నోరు ఊరుతుంది. అలాగని మనం తిన గలిగింది ఒక్క ముక్క నే. మీతో తమన్ అలాంటివి 50 ముక్కలు తినిపిస్తాడు. జాతరలో మోగే ద్రమ్ముల పక్కన 3 గంటలు కూచోపెట్టి. సినిమాకు రకరకాల ఎమోషన్స్ balance చేయాలి అని రాజమౌళి 8 సినిమాలు తీసి చూపించినా మిగతావాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పట్టించు కావట్లేదు. ప్రేక్షకుడు ఒక 5-10 నిమిషాలకు మించి ఫైట్స్ చూడలేడు. అలాంటివి 2:30 గంట లలో మొత్తం లో 3-4 కన్న ఎక్కువ చూడ లేడు.
అదే రకంగా డాన్స్ లు కూడా. సరైనొడు సినిమాను పక్కన బెట్టుకుని ఎమోషన్స్ balance చేసినా సినిమా ఇంతకు వంద రెట్లు బాగా వచ్చేది. సినిమా చూసిన తరువాత మనసు ప్రశాంతంగా ఉండి అందులోని మంచి సీన్స్ గురించి పదే పదె గుర్తు చేసుకుని సంతోష పడేలా ఉండాలి. తల రెండు చేతులతో ఒత్తుకుంటూ బయటికి రాకూడదు...