కొత్త బాటిల్ లొ పాత సరుకు..
Positives: ఎలివేషన్లు, ఫోటోగ్రఫి (DOP), బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైరక్షన్, ఆర్టిస్టులు 100% ప్రతిభ కనబరిచారు.
Negatives: కథ పాతదే అవ్వడం
సినిమా స్టోరీ విషయానికి వస్తె
మదన పల్లి లోని లోకల్ ఎమ్మెల్యే లీజు కు తీసుకున్న టి ఎస్టేట్ నుంచి కథ మొదలై , వైష్ణవి అనే చిన్నపాప చుట్టూ కథ తిరుగుతూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అక్కడక్కడ డాకు మహారాజ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసుకుంటూ మంచి పిక్చరైజేషన్ తో, రెండు పాటలతో ,బాలయ్య అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మొదటి భాగం మెప్పిస్తుంది.
రెండవ భాగం లో సీతారాం గా బాలయ్య ఎంట్రీ తో పాటు , మెయిన్ విలన్ బాబీ డియోల్ పాత్రలు బాగుంటాయి. ఠాకూర్ ల ఫ్యామిలీ మైనింగ్ పేరుతొ కొకెయిన్ పండించే దగ్గర నుంచి ఆ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం పడే కష్టాలు, వాటిని ఆసరాగా చేసుకొని వాళ్ళ మీద విలన్ మరియు అతని అనుచరులు చేసే అరాచకాలుతో ఆ ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతారు. వాళ్ళ కోసం ias గా వుండే సీతారాం పేదల కోసం పోరాడే మహారాజ్ గా డాకు మహారాజ్ గా మారే సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ తేలిపోయిన ఫొటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అంతగా ఎమ్ అనిపించదు.
మొత్తానికి బాలయ్య నట విశ్వరూపం, తమన్ మ్యూజిక్, ఫోటోగ్రఫి కొత్తగా ఉంటాయి.
మిగతా నటీనటులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు నటించారు.
డాకు మహారాజ్ పోరాట సన్నివేశాలు ఎక్కువగా లేకపోవడం వలన స్టోరీ బాగుంది అనిపించదు.
My Rating: 3/5.