జాతిరత్నాలు:-
ముగ్గురు నిరుద్యోగ యువకుల కథ. పట్నం పోయి settle అవుదాం అనుకునే వీరి జీవితాలు, సిటీ వచ్చాక హత్యాయత్నం లో trap అవుతాయి.
.
.
నవీన్ పొలిశెట్టి పేరు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో మారుమ్రోగింది. కామెడీ టైమింగ్ అత్యద్భుతం. దర్శి, రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి లో ఫ్రెండ్) హీరోకి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్. హీరోయిన్ పేరు తెలియదు కానీ, simple and cute character.
.
.
వెకిలి చేష్టలు లేవు, పెళ్ళాం మీద, అక్రమ సంబంధాలు వంటి పనికిమాలిన డైలాగులు లేవు.
.
.
*మీకు ఇబ్బందిగా ఉంటే, నేనే వెళ్లిపోతాను* అంటూ రాహుల్ రామకృష్ణ అనే డైలాగు superb.
.
.
Court లో ఏం చెప్తున్నానో ట్తెలియకుండా, ఏదో ఒకటి చెప్పే హీరో డైలాగు హైలైట్. సినిమా హాల్ *ప్రతిధ్వనించింది* కామెడీ timings కి.
.
.
సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ కామెడీ చిత్రం. ముఖ్యంగా చిన్న పిల్లలతో చూడండి ఈ సినిమా, వాళ్ళ స్వచ్ఛమైన చిరునవ్వు చూస్తే ఆ పిల్లలకి మనం ఒక మంచి సినిమా చూపించామన్న భావన తప్పక కలుగుతుంది.
.
.
అన్నిటికన్నా సస్పెన్స్ climax సీన్. సాధారణంగా , ఏదైనా వీడియో చూపించి blackmail చెయ్యటం సహజం. కానీ, ఈ సినిమాలో అటువంటి వీడియో క్లైమాక్స్ లో ఉంటుంది. అది కూడా 30-40 seconds మాత్రమే. మీరు నవ్వు ఆపుకోలేరు. I bet... 👍👍
.
.
ఇలాంటి జాతి రత్నాలు మీకు friends గా ఉంటే, ఎప్పుడూ వాళ్ళని దూరం చేసుకోకండి.
.
.
లక్కా మునేశ్వర రావు