మొదటి భాగం విడుదలైన దాదాపు ముడున్నర సంవత్సరాల తర్వాత ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు కేజిఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఆ అంచనాలు అంతా తలకిందులై బిలో యావరేజ్ మూవీగా నిలిచింది , కేజిఎఫ్ మొదటి అధ్యాయం లో యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరో నటన , అనంత్ నాగ్ హీరో గురించి వివరించే సన్నివేశాలు చాలా రక్తికట్టించాయి , కానీ కేజిఎఫ్ 2 కి అనంత్ నాగ్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ని పెట్టి హీరో గురించి వివరించే సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపలేదు, సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ ఐంది , హీరో క్యారెక్టర్ మీద పెట్టిన శ్రధ్ధ మిగతా పాత్రల మీద పెట్టకపోవడం వల్ల మిగతా నటీనటులకు అంతగా నటించే స్కోప్ లేకుండా పోయింది, సంజయ్ దత్ , రావు రమేష్, రవీనా టండన్ వీరి పాత్రలు, హీరో ముందు తేలిపోయాయి , అనవసర సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోయింది హీరోయిన్ పాత్ర డమ్మీ గా మారింది, ఈశ్వరీ రావ్ పాత్ర ఎందుకు పెట్టారో తెలియదు, హీరో , హీరోయిన్ల పాత్రలు చనిపోవడం తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించదం , కన్నడ లో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి, ప్రశాంత్ నీల్ దర్శకత్వం తేలిపోయింది , ప్రభాస్ అభిమానులకు చేదువార్తే , అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చే సినిమా సందేహమే , ఏప్రిల్ 29 న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వరకు ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి , RRR కలెక్షన్స్ ఐతే సేఫ్