రంగమార్తండ అద్భుతమైన సినిమా అని చెప్పలేము గానీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ గార్ల నటన కోసం మాత్రం తప్పకుండా చూడాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం గారి సీరియస్ నటనకు నంది అవార్డ్ ఇవ్వాల్సిందే. కధలో కొత్తదనం లేదు. విలువలు గురించి చెప్పే ముఖ్య పాత్రధారులు ఇంట్లో అందరి ముందు గొప్పగా మందు కొట్టడం తాము వయసులో చేసిన చెత్తపనులు గురించి నవ్వుతు చెప్పుకోవడం చూస్తుంటే దర్శకుడు సినిమా చూసే ప్రేక్షకులకు ఏమి చేప్పాలని అనుకుంటున్నాడో అర్ధం కాదు. తండ్రిగా తన బాధ్యతలు మర్చిపోయి తన సంతానం చేసే తప్పులకు కుమిలిపోవడం నచ్చలేదు. కధలో కొత్తదనం ఉంటే బాగుండేది.