ప్రస్తుతం రాష్ట్రాల్లో, దేశంలో జరుగుతున్న ఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. తమ స్వార్థ రాజకీయాల కోసం, రాజకీయ భవితవ్యం కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతూ, ఊదరగొట్టే పథకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, భావిభారత పౌరుల జీవితాలకు తిలోదకాలు దిద్దుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రవర్తన ఈ చిత్రంలో జీవం పోసుకుంది. ఇలాంటి సినిమాలు రావాలి జనాన్ని చైతన్యపరచాలి! దేశానికి కావాల్సింది భావి భారత పౌరుల ఉన్నతే కానీ ఎత్తైన విగ్రహాలు కాదు!!